venkatesh: విదేశాల్లో షూటింగు పూర్తిచేసిన 'ఎఫ్ 2' టీమ్

- అనిల్ రావిపూడి దర్శకుడిగా 'ఎఫ్ 2'
- కథానాయికలుగా తమన్నా .. మెహ్రీన్
- కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్
వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'ఎఫ్ 2' రూపొందుతోంది. 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనేది ట్యాగ్ లైన్. ఈ మల్టీ స్టారర్ మూవీలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు కొంతకాలంగా విదేశాల్లో జరుగుతోంది.
