Karnakata: కుమారస్వామి కీలక నిర్ణయం... కన్నడనాట తగ్గిన పెట్రోలు ధరలు!
- సుంకాలను తగ్గించిన సంకీర్ణ సర్కారు
- రూ. 2 తగ్గిస్తున్నట్టు ప్రకటన
- ప్రజలకు స్వల్ప ఉపశమనం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుకు చేరి, సామాన్యులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న 'పెట్రో' ధరల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కల్పించారు. లీటరు పెట్రోలు, డీజిల్ పై సుంకాన్ని రూ. 2 మేరకు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం కన్నడనాట పెట్రోలు ధర లీటరుకు సుమారుగా రూ. 85 నుంచి రూ. 88 మధ్య ఉండగా, కుమారస్వామి తాజా నిర్ణయంతో ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. సుంకాల తగ్గింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఇటీవలి కాలంలో పెట్రోలు ధరలు నిత్యమూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.