maruthi: ఆరంభంలో విమర్శలు వచ్చిన మాట నిజమే: దర్శకుడు మారుతి
- నాకంటూ ఒక టేకాఫ్ కావాలి
- అందుకే ఆరంభంలో అలా చేశాను
- ఆ తరువాత కొత్త రూట్లో వెళుతున్నాను
ఇటు యూత్ ఆడియన్స్ .. అటు మాస్ ఆడియన్స్ పల్స్ గురించి బాగా తెలిసిన దర్శకులలో మారుతి ఒకరు. కథాకథనాలను పూర్తి వినోదాత్మకంగా ఆవిష్కరించడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత వుంది. అలాంటి మారుతి తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ ఆరంభాన్ని గురించి ప్రస్తావించాడు.
"ఈ రోజుల్లో .. బస్టాప్ వంటి చిత్రాలకు విమర్శలు ఎదురైన మాట వాస్తవమే. అయితే బూతులు పెట్టడం వల్లనే సినిమాలు హిట్ అవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు .. అలా ఆలోచించలేదు. తొలినాళ్లలో తీసిన సినిమాల్లోను కంటెంట్ ఉండేది .. అది యూత్ కి నచ్చేది. ఆరంభంలో నాకు ఒక టేకాఫ్ కావాలి కనుక .. యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాను. హిట్లు వస్తున్నాయి .. డబ్బులు వస్తున్నాయి కదా అని అదే తరహా సినిమాలు చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అందుకే ఆ తరువాత ఒక సినిమాకి .. మరో సినిమాకి సంబంధం లేకుండా విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ వెళుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.