Vijayawada: జగన్ కు ఝలక్ ఇవ్వనున్న వంగవీటి రాధాకృష్ణ... అనుచరులతో ఎడతెగని మంతనాలు!

  • విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని రాధాకృష్ణ భావన
  • స్పష్టమైన హామీ ఇవ్వని వైఎస్ జగన్
  • అసంతృప్తితో చర్చలు సాగిస్తున్న వంగవీటి

విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతల్లో ఒకరైన వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారడం ద్వారా వైఎస్ జగన్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ పడేందుకు టికెట్ ఆశించిన ఆయన, ఆ మేరకు జగన్ నుంచి హామీని పొందలేకపోయిన సంగతి తెలిసిందే.

దీంతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణ,  నిన్న పార్టీ ముఖ్య నేతల సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు కూడా. ఆపై రాత్రి పొద్దుపోయేవరకూ తన కుటుంబీకులు, ప్రధాన అనుచరులతో సమావేశమై చర్చలు సాగించిన ఆయన, వైకాపాలో తగినంత గుర్తింపు లభించడం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీని వీడిన పక్షంలో ఏ పార్టీలో చేరాలన్న విషయంలో కూడా అనుచరులతో ఆయన మంతనాలు సాగించినట్టు సమాచారం. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది. 

Vijayawada
Vangaveeti Radhakrishna
YSRCP
  • Loading...

More Telugu News