chalasani srinivas: హోదా ఉద్యమాన్ని రాజకీయం చేయొద్దు: చలసాని శ్రీనివాస్‌

  • చివరి దశకు చేరిన పోరు
  • త్వరలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ
  • హోదా సాధనకు కలిసిరాని పార్టీలను ఎన్నికల్లో ఓడించాలి

రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తమైన హోదా ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయొద్దని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉద్యమం చివరి దశకు చేరిందని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గుంటూరులో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. హోదా ఉద్యమంతో కలిసిరాని పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

chalasani srinivas
Andhra Pradesh
  • Loading...

More Telugu News