Kodandaram: చీకటి ఒప్పందాలను కోదండరామ్ బయటపెట్టాలి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

  • తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్, టీడీపీలు యత్నించాయి
  • అలాంటి పార్టీలతో కోదండరామ్ ఎలా జతకడతారు
  • అభివృద్ధిని అడ్డుకోవడమే మహాకూటమి లక్ష్యం

తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని కాంగ్రెస్, టీడీపీలు యత్నించాయని... అలాంటి పార్టీలతో టీజేఎస్ అధినేత కోదండరామ్ ఎలా జతకడతారని టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీలతో చేసుకున్న చీకటి ఒప్పందాలను కోదండరామ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని... ఈ అభివృద్ధిని అడ్డుకోవడమే మహాకూటమి లక్ష్యమని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో మహాకూటమి చిత్తుకాక తప్పదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే... టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.

Kodandaram
TRS
congress
Telugudesam
vinay bhaskar
kcr
  • Loading...

More Telugu News