Chandrababu: చంద్రబాబుకు లేఖ రాసిన కేరళ ముఖ్యమంత్రి!

  • కేరళకు సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపిన విజయన్
  • మీ సాయం దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందంటూ కితాబు
  • ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు సాయం చేయడం గొప్ప విషయం అంటూ ప్రశంస

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకున్నందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు,సంస్థల సాయాన్ని కొనియాడారు. మీరు చేసిన సహాయం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. మీరు చేసిన రూ. 40.18 కోట్ల సాయంలో... ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు రూ. 10 కోట్లు అందించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.  

Chandrababu
pinarayi vijayan
letter
kerala
flood
donations
  • Loading...

More Telugu News