Pranay: మైనర్లుగా ఉన్నప్పుడే రహస్య వివాహం చేసుకున్న ప్రణయ్, అమృత!

  • హైస్కూల్ లో ఉన్నప్పుడే ప్రేమ మొదలు
  • రహస్యంగా పెళ్లి చేసుకుని దాచిపెట్టిన ప్రణయ్, అమృత
  • మైనారిటీ తీరిన నాలుగేళ్ల తరువాత మళ్లీ వివాహం

శుక్రవారం నాడు మిర్యాలగూడలో నడిరోడ్డుపై పరువు హత్యకు గురైన ప్రణయ్ ఎన్నో సంవత్సరాల క్రితమే తమ ప్రియురాలు అమృత వర్షిణిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైస్కూల్ లో కలసి ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే ప్రణయ్ తో ప్రేమలో పడ్డ అమృత, ఆపై కాలేజీ చదువుతున్న రోజుల్లో అతన్ని మరింతగా ఇష్టపడింది. ఆ సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరూ, తమ పెళ్లి బయటకు తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయంతో, దాన్ని దాచిపెట్టారని కేసు విచారణలో భాగంగా అమృతను ప్రశ్నించిన పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆపై హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న రోజుల్లో వీరు నిత్యమూ కలిసేవారని, మైనారిటీ తీరిన నాలుగేళ్ల తరువాత తమ రహస్య వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారని, ఆ తరువాతే ఇద్దరి ఇళ్లలో పెళ్లి గురించి చెప్పారని అన్నారు. దీంతో అప్పటివరకూ కులాంతర వివాహం వద్దని హెచ్చరిస్తూ వచ్చిన అమృత తండ్రి, పెళ్లయిందని, గర్భం దాల్చిందని తెలుసుకున్న తరువాత సైకోగా మారి హత్యకు ప్లాన్ చేశారని చెప్పారు.

అమృతను ప్రణయ్ తల్లిదండ్రులు చాలా బాగా చూసుకున్నారని తమ విచారణలో వెల్లడైందని తెలిపిన పోలీసులు, తాము క్రిస్టియన్లయినా, అమృత కోసం వినాయక చవితి పండగను జరిపారని చెప్పారు.

Pranay
Amrutha
Lovers
Honor Killing
Marriage
  • Loading...

More Telugu News