Vizag: ఆ విధంగా దొంగ నుంచి ఆభరణాలను కాపాడుకున్న అమ్మవారు.. వైజాగ్ లో అద్భుతం!

  • పైడిమాంబ ఆలయంలో ఘటన
  • తెలివిగా లోపలకు చొరబడ్డ దొంగ
  • బయటకు వెళ్లేందుకు విఫలయత్నం

ఆలయంలో నగదును దోచుకోవడానికి వచ్చిన ఓ దొంగ హుండీలు పగలగొట్టాడు. డబ్బులు తీసుకున్నాక అమ్మవారి ఆభరణాలను సైతం తీసుకున్నాడు. లోపలికి అయితే వచ్చాడు కానీ తిరిగి వెళ్లడం అతనివల్ల కాలేదు. దీంతో పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

వేపకుంటలోని శ్రీ పైడిమాంబ ఆలయంలోకి ఓ దొంగ ప్రవేశించాడు. అక్కడ ఉన్న హుండీలను పగలగొట్టి డబ్బును దోచుకున్నాడు. అక్కడితో వెళ్లిపోకుండా అమ్మవారికి అలంకరించే ఆభరణాలను కూడా తస్కరించాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఎంతగా ట్రై చేసినా లోపలి గదిని దాటి వెళ్లలేకపోవడంతో అక్కడే కూలబడిపోయాడు.

తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసేందుకు చేరుకున్న సిబ్బంది దొంగను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను కటకటాల వెనక్కి నెట్టారు.

Vizag
theft
temple
pydimamaba
Andhra Pradesh
Visakhapatnam District
Police
  • Loading...

More Telugu News