Amitsha: ఎంఐఎం హైదరా‘బాద్‌షా’ : అసదుద్దీన్‌ ఒవైసీ

  • ఇక్కడ మమ్మల్ని ఓడించడం ఎవరి తరమూ కాదు
  • సాక్షాత్తు అమిత్‌ షా పోటీ చేసినా ఓటమి ఖాయం
  • రానున్న ఎన్నికల్లోనూ మా గెలుపు పక్కా

హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించడం ఎవరి తరమూ కాదని, దమ్ముంటే సాక్షాత్తు బీజేపీ చీఫ్‌ అమిత్‌షానే పోటీ చేయాలని ఆ పార్టీ చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఎంఐఎంపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ తీవ్రంగా స్పందించారు. అమిత్‌ షా పోటీ చేసినా హైదరాబాద్‌లో బీజేపీకి ఓటమి తప్పదని ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లోనూ రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని, బీజేపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. పెట్రో ధరలు తగ్గించలేని చేతకాని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ఏదో ఒకటి మాట్లాడి ఢిల్లీ వెళ్లడం తప్ప అమిత్‌షా చేసింది ఏమీ లేదన్నారు. 

Amitsha
BJP
Asaduddin Owaisi
MIM
Telangana
  • Loading...

More Telugu News