Vijayawada: బెజవాడలో ఆనంద ఆదివారం... రోడ్లపై పిల్లా పెద్దా ఏకమై చిందులు!

  • విజయవాడలో ఉత్సాహంగా హ్యాపీ సండే
  • వయో బేధాలు మరచి డ్యాన్సులేసిన ప్రజలు
  • మరింత మనోరంజకంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు

విజయవాడలో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉదయం జరిగిన ఆనంద ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు తమ వయసు భేదాలు మరచి సినిమా పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేశారు.

రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా, మనోరంజకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ క్రీడల డైరెక్టర్ శేఖర్ వెల్లడించారు. యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని, ఐకమత్యాన్ని పెంచుతోందని ఆయన అన్నారు. కాగా, ఆనంద ఆదివారం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి పోలీసులు మళ్లించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News