honour killing: ప్రణయ్ ను చంపేందుకు గతంలో మూడు సార్లు ట్రై చేశారు.. నాలుగోసారి పొట్టనపెట్టుకున్నారు!: అమృత

  • ఆరు నెలల్లో 3 సార్లు హత్యకు కుట్ర
  • తప్పించుకున్న ప్రణయ్
  • ముందు జాగ్రత్తగా సీసీటీవీల ఏర్పాటు

మిర్యాలగూడ పరువు హత్య కేసులో ప్రణయ్ ను హత్య చేసేందుకు తన తండ్రి మారుతీరావు చాలా తీవ్రంగా ప్రయత్నించాడని అమృత తెలిపింది. గత ఆరు నెలలుగా తాము ఎక్కడికి వెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించేవారని వెల్లడించింది. ప్రణయ్ ను హత్యచేసేందుకు గత 6 నెలలుగా మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయని అమృత చెప్పింది. ఇలాంటి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన తన అత్తింటివారు సీసీటీవీలను ఏర్పాటు చేశారని పేర్కొంది.

ప్రణయ్ తో జనవరిలో తన వివాహం అయినప్పటి నుంచి తన అత్త ప్రేమలత కంటికి రెప్పలా కాపాడుకుందనీ, 24 గంటలు ఇంటి వరండాలోనే కూర్చుని అపరిచితుల రాకపోకలను జాగ్రత్తగా గమనించేదని వెల్లడించింది. ప్రణయ్ తనను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడని భోరున విలపించింది.

honour killing
Telangana
pranay
amruta
CCTV
miryalaguda
Nalgonda District
  • Loading...

More Telugu News