Miryalaguda: మా బంధువుల అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటే, తాళిని తెంపి వేరే పెళ్లి చేశారు!: అమృత వర్షిణి

  • కులాంతర వివాహాలకు వ్యతిరేకమని తెలుసు
  • పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనే ప్రేమ వివాహం
  • ప్రణయ్ బాగా చూసుకునేవాడని వాపోయిన అమృత

తన ఇంట్లో కులాంతర వివాహాలను ఏ మాత్రమూ అంగీకరించబోరని తనకు చిన్నప్పటి నుంచే తెలుసునని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి వ్యాఖ్యానించింది. మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్తతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన భర్తకు అపాయముందని తెలుసునని, అయితే, అది తన తండ్రి నుంచే వస్తుందని అనుకోలేదని వాపోయింది.

తమ బంధువుల అమ్మాయి, వరుసకు అక్క అయ్యే యువతి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆమెను బలవంతంగా ఇంటికి తెచ్చి, తాళిని తెంపిన బాబాయ్, ఆమెకు బలవంతంగా మరో పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది. పోలీసులు, మీడియా ఉన్నారన్న ధైర్యంతోనే తాను ప్రేమ వివాహం చేసుకున్నానని, తనను ప్రణయ్ ఎంతో బాగా చూసుకునేవాడని చెప్పింది. కొత్త ప్లేసెస్ కు వెళ్లాలంటే భయపడుతూ, ఎక్కడికీ వెళ్లేవాళ్లం కాదని, కానీ, ఆసుపత్రి ముందు నడిరోడ్డుపైనే హత్యకు ప్లాన్ చేస్తారని ఊహించలేదని విలపిస్తూ చెప్పింది.

Miryalaguda
Amruta Varshini
Love Marriage
Honor Killing
  • Loading...

More Telugu News