operation garuda: ఐవైఆర్ బీజేపీలో చేరడంతో ముసుగు తొలగిపోయింది!: ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక

  • వైసీపీ-బీజేపీ బంధాన్ని బలపరుస్తున్నారు 
  • 'ఆపరేషన్ గరుడ’లో ఐవైఆర్ కృష్ణారావుది కీలకపాత్ర
  • ఏపీ ప్రభుత్వంపై ఐవైఆర్ తప్పుడు నివేదికలు

చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ అమలుచేస్తున్న ‘ఆపరేషన్ గరుడ’లో ఐవైఆర్ కృష్ణారావు కీలకపాత్ర పోషించారని ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. తాజాగా బీజేపీలో చేరడం ద్వారా ఐవైఆర్ ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ-వైసీపీ బంధాన్ని బలపర్చేందుకు ఐవైఆర్ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఐవైఆర్ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపాడని శ్రీధర్ ఆరోపించారు. స్వార్థం కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని కోరారు. తిరుమల శ్రీవారిని ఆపరేషన్ గరుడ రాజకీయానికి వాడుతూ ఐవైఆర్ చాలా పెద్ద పాపం చేస్తున్నారని శ్రీధర్ హెచ్చరించారు.

operation garuda
IYR
  • Loading...

More Telugu News