Matrimonial: 37 ఏళ్ల ముదురు వరుడి వివాహ ప్రకటన... కోరికలు చూసి నెటిజన్ల తిట్లు!

  • వైరల్ అయిన వ్యక్తి మేట్రిమోనియల్ యాడ్
  • షరతులను చూసి విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
  • అతని ఘాటు సమాధానాలు కూడా వైరల్!

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ 37 సంవత్సరాల వరుడు ఓ మేట్రిమోనియల్ సైట్ లో పెట్టిన ప్రకటన వైరల్ అయి, నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆ ముదురు వరుడికి ఉన్న అభిప్రాయాలను చూసి ఇప్పుడు అతనిచ్చిన మెయిల్ ఐడీకి మెయిల్స్ పెడుతూ కడిగిపారేస్తున్నారు పలువురు. ఇంతకీ అతను ఏమని ప్రకటన ఇచ్చాడో తెలుసా?

ఇంటర్నేషనల్ ఎక్స్ పోర్టు బిజినెస్ చేస్తూ, ఎనిమిది అంకెల సంపాదన ఉన్న క్షత్రియ పురుషుడైన అతనికి 26 సంవత్సరాలలోపు వధువు కావాలట. అమ్మాయి అందంగా ఉండాలట. ఆ అమ్మాయికి స్మోకింగ్ అలవాటు ఉండకూడదట. స్ర్రీవాదిగా ఉండకూడదట. రుచిగా వంట చేయడం రావాలట. గతంలో పెళ్లి కానిదై ఉండాలట లేదా పిల్లలు ఉండకూడదట. పైగా, తనకు కుల మతాల పట్టింపులు లేవని, కట్నం వద్దనీ అతను పేర్కొన్నాడు. అమ్మాయిల ఫొటోగ్రాఫ్ లు పంపాలని చెబుతూ ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చాడు.

అతను పెట్టిన షరతులకు కోపం తెచ్చుకున్న పలువురు, ఆ మెయిల్ ఐడీకి ఈ-మెయిల్స్ పెడుతున్నారు. కులం అడగకుండా, అతనిది ఏ కులమో ఇండికేషన్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఈ-మెయిల్స్ కు సదరు వ్యక్తి ఘాటుగా స్పందించడంతో వాటిని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Matrimonial
Add
Karnataka
  • Loading...

More Telugu News