Hurricane: మరీ ఇంత ఓవరా?... వాతావరణంపై రిపోర్టు ఇస్తూ రిపోర్టర్ చేసిన 'అతి'పై విమర్శలు!

  • ఫ్లోరెన్స్ తుపానుపై రిపోర్టింగ్
  • బలమైన గాలులకు నిలబడలేకపోయిన రిపోర్టర్
  • అతడి వెనకే జనాలు మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయిన వైనం

వాతావరణంపై లైవ్ రిపోర్టు ఇస్తూ ఓ టీవీ రిపోర్టర్ చేసిన పని పలు విమర్శలకు దారి తీసింది. అమెరికాలో ఫ్లోరెన్స్ తుపాను సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. వందల మైళ్ల వేగంతో గాలులు వీస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. నార్త్ కరోలినాలోని ఓ టీవీ చానల్ ఫ్లోరెన్స్ తుపానుపై వార్తను ప్రసారం చేస్తోంది. చానల్‌కు చెందిన ఓ రిపోర్టర్ మైక్ సీడెల్ రెయిన్ కోటు తొడుక్కుని రోడ్డుపైకి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాడు. వేగంగా వీస్తున్న బలమైన గాలులు అతడిని నిలబడనీయడం లేదు. వెనక్కి నెట్టేస్తున్నాయి. దాదాపు పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ గాలులకు ఎదురొడ్డి సమాచారం అందిస్తున్నాడు. గాలులు ఎంత బలంగా వీస్తున్నదీ తనను చూస్తే తెలిసిపోతుందని పేర్కొన్నాడు.

అక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బలమైన గాలులకు అతడు నిల్చోవడమే కష్టంగా ఉంటే.. అతడి వెనకనే ఇద్దరు వ్యక్తులు అక్కడసలు గాలే లేనట్టు మామూలుగా నడుచుకుంటూ పోతున్నారు. వారంత మామాలుగా నడుస్తూ వెళ్లిపోతుంటే సీడెల్ మాత్రం అసలు నిలబడడమే కష్టంగా ఉన్నట్టు చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిపోర్టర్ అతి చేశాడని, ఓవర్ డ్రామా కట్టిపెట్టాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరైతే సీడెల్‌కు ‘ఆస్కార్’ ఇవ్వొచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News