Miryalaguda: ప్లీజ్ అంకుల్... నన్ను ప్రణయ్ దగ్గరకు తీసుకెళ్లండి: వేడుకుంటున్న అమృత వర్షిణి

  • గర్భిణిగా ఉన్న అమృతకు విశ్రాంతిని సూచిస్తున్న వైద్యులు
  • భర్తకు గుర్తుగా బిడ్డను పెంచుకుంటానంటున్న అమృత
  • పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి వద్ద కన్నీరు

పరువు కోసం పాకులాడే తండ్రి దుర్మార్గానికి బలై, భర్తను పోగొట్టుకున్న మిర్యాలగూడ యువతి అమృత వర్షిణి, ఇప్పుడు తనను పరామర్శించేందుకు వస్తున్న వారిని ఒకటే అడుగుతోంది. తనను ప్రణయ్ దగ్గరకు తీసుకు వెళ్లాలని వేడుకుంటోంది. ఆమె గర్భిణి కావడంతో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తుండగా, ఆమె మాత్రం, తనకు ప్రణయ్ ని చూపించాలని, తనను వదిలి పెట్టాలని అడుగుతోంది.

టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడలోని ఆసుపత్రికి వచ్చి అమృతను పరామర్శించగా, "ప్లీజ్ అంకుల్..." అంటూ ఆమె విలపించిన తీరు అందరితో కంటతడి పెట్టిస్తోంది. ఇక తనకు బిడ్డే లోకమని, భర్త ప్రేమకు గుర్తుగా, పుట్టబోయే బేబీని పెంచుకుంటానని అమృత తెలిపింది. తన కళ్లముందే తన భర్తను చంపేశారని, ప్రణయ్ ని ఆ పరిస్థితుల్లో చూస్తానని కలలోనూ అనుకోలేదని ఆమె కన్నీరు పెట్టుకుంది. జీవితాంతం సంతోషంగా ఉంటామని భావించానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పింది.

Miryalaguda
Honor Killing
Pranay
Amrutha
  • Loading...

More Telugu News