undavalli arun kumar: బాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటుంది!: ఉండవల్లి

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
  • అమరావతి బాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు 
  • వైఎస్, రోశయ్య, కిరణ్ హయాంలో అప్పుల జోలికి వెళ్లలేదు  

చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అమరావతి బాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన విమర్శించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో ప్రభుత్వం ఏనాడూ అప్పుల జోలికి వెళ్లలేదని ఉండవల్లి స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు సీఎంగా ఉంటే ఎప్పుడూ అప్పులేనని ఆరోపించారు.

undavalli arun kumar
kiran kumar reddy
rosaiah
Congress
  • Loading...

More Telugu News