amit shah: ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్ షా.. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య లడాయి మొదలైందంటూ వ్యాఖ్య!

  • భారత్ మాతాకీ జై అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నారు
  • రెండు ఎన్నికలకు ఎంతో ప్రజా సంపద ఖర్చు అవుతుంది

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్ నగర్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఢమరుకం మోగించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. 'భారత్ మాతాకీ జై' అంటూ తన ప్రసంగాన్ని అమిత్ షా ప్రారంభించారు.

అనంతరం సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉన్నా... కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు ఎన్నికల నిర్వహణ కోసం భారీ ఎత్తున ప్రజా సంపద ఖర్చు అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య లడాయి మొదలైందని అన్నారు.

amit shah
kcr
bjp
election
campaign
  • Loading...

More Telugu News