airtel: జియోకి పోటీగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్!

  • రూ.419 పేరిట కొత్త ఆఫర్
  • రోజుకి 1.4జీబీ డేటా
  • 75 రోజుల వ్యాలిడిటీ

టెలికాం రంగంలో జియోకి పోటీగా పలు సంస్థలు రకరకాల ఆఫర్ లు ప్రకటిస్తున్నాయి. ఎయిర్ టెల్ నుండి నిన్ననే రూ.97 పేరిట కాంబో రీఛార్జి ఆఫర్ మార్కెట్లోకి రాగా, తాజాగా రూ.419 పేరిట మరో ఆఫర్ ని ప్రకటించింది. ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్ లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు. 75 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్ లో ఎటువంటి (యఫ్.యూ.పీ) పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, రోజుకి 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందుతారు. కాగా, ఎయిర్ టెల్ లో రోజుకి 1.4జీబీ డేటాని అందించే వివిధ రకాల ఆఫర్లు ఉన్నప్పటికీ వాటి వ్యాలిడిటీలో తేడా ఉంది.

airtel
jio
Reliance
Tech-News
  • Loading...

More Telugu News