BALKA SUMAN: తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ తిష్ట.. తెలంగాణ విచ్ఛిన్నానికి బాబు కుట్ర!: బాల్కసుమన్ ఆరోపణ

  • అక్కడ దోచుకున్న సొమ్మును ఇక్కడ ఖర్చు పెట్టాలని చూస్తున్నారు 
  • అందుకే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల తిష్ట
  • మహారాష్ట్ర కేసు పెడితే మేమెందుకు స్పందించాలి?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, ఎంపీ బాల్కసుమన్‌ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం తిష్ట వేసిందని ఆరోపించారు. అక్కడ దోచుకున్న సొమ్మును తెలంగాణలో ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బాబు కుట్ర పన్నాడన్నారు. తెలంగాణ భవన్ లో సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలసి ఈ రోజు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.

ఈ అధికారులను వెంటనే ఏపీకి పంపేయాలని డీజీపీ, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని బాల్క సుమన్ తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు బాబుపై కేసు నమోదుచేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించాలని సుమన్ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న పోలీసులు వారి కోసం పనిచేస్తే బాగుంటుందని చురకలు అంటించారు.

BALKA SUMAN
TRS
Telangana
Telugudesam
Andhra Pradesh
Chandrababu
AP INTELLIGENCE
AB VENKATESWARA RAO
CHIEF
Police
  • Loading...

More Telugu News