miryala guda: మీ పెళ్లి వీడియో కంటే వాడి చావు వీడియోకే ఎక్కువ లైక్స్ వస్తాయ్!: అమృతకు తండ్రి వార్నింగ్

  • వివాహం తర్వాత ఫొటో షూట్ నిర్వహించిన జంట
  • వీడియోను ఫేస్ బుక్ లో చూసి రగిలిపోయిన తండ్రి
  • గుండెలవిసేలా రోదిస్తున్న అమృత

మిర్యాలగూడలో కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అల్లుడు ప్రణయ్ ను మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రణయ్-అమృతలు వీడియో షూట్ నిర్వహించారు. ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఆమె తండ్రి రగిలిపోయాడు. అమృతకు ఫోన్ చేసి ‘మీ పెళ్లి వీడియో కంటే వాడిని నేను చంపే వీడియోకే ఎక్కువ లైక్స్ వస్తాయ్’ అంటూ హెచ్చరించాడని కుటుంబ సభ్యుడొకరు తెలిపారు.

ఈ వివాహానికి ప్రణయ్ కుటుంబం కూడా అంగీకరించలేదనీ, అయితే అమృత లేకుండా తాను బతకలేనని ప్రణయ్ చెప్పడంతో వెనక్కి తగ్గారని వెల్లడించారు. తన భర్త ప్రణయ్ ను చూస్తాననీ, ఒక్కసారి అక్కడకు తీసుకెళ్లాలని అమృత ఆసుపత్రిలో గుండెలవిసేలా రోదిస్తోంది.

miryala guda
honour killing
amruta
pranay
Police
facebook
post wedding shoot
Facebook
  • Loading...

More Telugu News