chaithu: కొన్ని సార్లు షూటింగ్ ఆపేసి మరీ నవ్వుకున్నాం: రమ్యకృష్ణ
- మంచి ఫ్యామిలీ డ్రామా వుంది
- అంతకి మించిన కామెడీ వుంది
- అందుకే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు
వినాయక చవితి సందర్భంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చైతూ అత్తగారైన 'శైలజ' పాత్రలో రమ్యకృష్ణ నటించారు. తాజాగా ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .."ఈ సినిమాకి వచ్చే ప్రేక్షకులకు కావలసినంత కామెడీ దొరుకుతుంది. సీనియర్ నరేశ్ .. పృథ్వీ .. వెన్నెల కిషోర్ పాత్రలు తెరపై నాన్ స్టాప్ నవ్వులను పూయిస్తాయి.
ఈ మూడు పాత్రల కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు నవ్వు ఆపుకుని .. డైలాగ్స్ చెప్పడం చాలా కష్టమయ్యేది. అందువలన కొన్ని సార్లు షూటింగు ఆపేసి మరీ నవ్వుకునేవాళ్లం. షూటింగ్ సమయంలో మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేశాము. ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో ఇంత కామెడీ వున్నది ఇదే. ఫ్యామిలీ డ్రామాతో పాటు కామెడీని కూడా ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేస్తుండటం ఆనందాన్ని ఇస్తోంది" అని ఆమె చెప్పుకొచ్చారు.