Lagadapati Rajagopal: ఆ సర్వేతో నాకు సంబంధం లేదు.. తేల్చి చెప్పిన లగడపాటి!

  • లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో హల్‌చల్
  • ఓ పార్టీకి అనుకూలంగా ఉండడంతో షేర్ల మీద షేర్లు
  • ఎన్నికల షెడ్యూలు తర్వాతే తన సర్వే ఉంటుందన్న లగడపాటి

గత రెండు మూడు రోజులుగా తెలంగాణ ముందస్తు ఎన్నికలపై 'లగడపాటి సర్వే' అంటూ సోషల్ మీడియాను ఓ సర్వే వివరాలు చుట్టేస్తున్నాయి. లగడపాటి సర్వే అంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని, వచ్చే ఎన్నికల్లో ఇదే జరగబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే ఓ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు దానిని షేర్ల మీద షేర్లు చేస్తూ వైరల్ చేశారు. తాజాగా, ఈ సర్వేపై టీఆర్ఎస్ నేత ఒకరు స్పందించారు. లగడపాటి రాజగోపాల్ సర్వే ఆంధ్రాలోనే తప్ప తెలంగాణలో పనికిరాదని తేల్చి చెప్పారు.

తన సర్వే పేరిట జరుగుతున్న ప్రచారంపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఆ సర్వే తనది కాదని, దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమన్నారు. ఆ సర్వే ఫలితాలకు, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలై, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తానని ఆయన వివరించారు. అప్పటి వరకు తన పేరిట ఏం జరిగినా నమ్మవద్దని సూచించారు.

Lagadapati Rajagopal
Telangana
Survey
Elections
Social Media
  • Loading...

More Telugu News