tolichowki: టోలిచౌకిలో ఉద్రిక్తత.. బాలికపై అత్యాచారం.. స్కూలుపై రాళ్లు రువ్విన విద్యార్థిని తల్లిదండ్రులు

  • మూడో తరగతి విద్యార్థినిపై అత్యాచారం?
  • స్కూలు వద్ద బాధిత బాలిక బంధువుల ఆందోళన
  • అదనపు బలగాలను దింపిన పోలీసులు

హైదరాబాద్ టోలిచౌకిలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మూడో తరగతి బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలతో బాధిత బాలిక బంధువులు స్థానిక అజాన్ ఇంటర్నేషనల్ స్కూలు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్కూలుపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అదనపు బలగాలను దింపి స్కూలు వద్ద మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. స్కూలు యాజమాన్యంపై బాధిత బాలిక తల్లిదండ్రులు గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

tolichowki
Hyderabad District
School
Girl
Police
  • Loading...

More Telugu News