rajath kumar: ఆరు నెలల్లోగా ఎన్నికలు.. 20లోగా ఈవీఎంలు పంపిస్తాం: రజత్

  • ఎన్నికల విధివిధానాలను వివరించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
  • ఈవీఎంలపై అనుమానాలొద్దు
  • ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాం

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాము చేపట్టబోయే చర్యలు, విధివిధానాల గురించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని... ఈ నెల 20లోగా రాష్ట్రానికి కావల్సిన ఈవీఎంలను పంపిస్తామన్నారు. ఈ ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని చెప్పారు. వీటిపై అనుమానాలొద్దని రజత్ తెలిపారు.

ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై కూడా నిఘా ఉంటుందని రజత్ స్పష్టం చేశారు. 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News