Vishnu Vardhan Reddy: తెలంగాణ ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
  • చంద్రబాబుపై కేసు పెట్టింది బీజేపీ కాదు.. కాంగ్రెస్ పెట్టింది
  • కోర్టు విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ రాదా?

బాబ్లీ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిందని, అందుకే, తన ఉనికిని కాపాడుకునేందుకు, ఎన్నికల్లో ఓట్లను దండుకునేందుకు ఈ అంశాన్ని చంద్రబాబు అస్త్రంగా వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వెనుక బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు. చంద్రబాబుపై బీజేపీ కేసు పెట్టలేదని, కాంగ్రెస్ పార్టీ ఆ కేసు పెట్టిందని అన్నారు. కోర్టు విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ వస్తుందనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ ముసుగు ధరించి హీరో శివాజీ మాట్లాడుతున్నారని అన్నారు.

Vishnu Vardhan Reddy
Chandrababu
case
congress
bjp
  • Loading...

More Telugu News