amit shah: రేపు హైదరాబాదుకు వస్తున్న అమిత్ షా.. షెడ్యూల్ వివరాలు!

  • రేపు ఉదయం 11.30కు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా
  • మహబూబూన్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న బీజేపీ అధినేత
  • సాయంత్రం 6 గంటలకు బీజేపీ శ్రేణులకు మార్గనిర్దేశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పాతబస్తీలో ఉన్న లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ బహిరంగసభకు బయల్దేరుతారు. కొత్తూరులో సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయి, ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు అనైతికమైన పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. జీవం లేని కాంగ్రెస్ ను టీడీపీ, సీపీఐలు బతికించలేవని చెప్పారు.

amit shah
Hyderabad
election
campaign
  • Loading...

More Telugu News