raghuveera reddy: చంద్రబాబుపై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టిన రఘువీరా

  • నోటీసులివ్వడం ముమ్మాటికీ తప్పేనన్న రఘువీరా
  • ప్రజా పోరాటాలు చేస్తే కేసులు పెట్టడమేంటని ఆగ్రహం
  • ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గతంలో చేపట్టిన ఆందోళనకు గాను ఏపీ సీఎంకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ సైతం తప్పుబట్టింది. బాబుపై కేసులు, నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ తప్పేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా పోరాటాలు చేస్తే కేసులు పెట్టడమేంటని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని తేల్చి చెప్పిన ఆయన, ఏపీలో ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 

raghuveera reddy
Congress
Chandrababu
Dharmabad court
  • Loading...

More Telugu News