jaleel khan: ఆయన పేరులోనే కన్నం ఉంది: ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై జలీల్ ఖాన్ సెటైర్

  • రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత కన్నా లక్ష్మీనారాయణది
  • చంద్రబాబుకు కాదు... జైట్లీకి వారెంట్ ఇవ్వాలి
  • మహాకూటమికి మోదీ భయపడుతున్నారు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరులోనే కన్నం ఉందని... ఉమ్మడి రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచేసిన ఘనత ఆయనదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారెంట్ ఇవ్వాల్సింది చంద్రబాబుకు కాదని... ఎప్పుడూ మోదీ పక్కన ఉండే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఇవ్వాలని అన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసేందుకు విజయ్ మాల్యాకు సహకరించిన జైట్లీకి వారెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

మహాకూటమి అంటేనే మోదీ భయపడుతున్నారని... అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. త్వరలోనే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని... అయితే, వారి పేర్లను ఇప్పుడు తాను ప్రకటించలేనని చెప్పారు. 

jaleel khan
Chandrababu
modi
Arun Jaitly
  • Loading...

More Telugu News