ashok gajapathi raju: మోదీ, అమిత్ షాలకు ఇది మంచిది కాదు: అశోక్ గజపతిరాజు

  • చంద్రబాబుకు వారెంట్ బీజేపీ కుట్రలో భాగం
  • పాత కేసులను తిరగదోడటం మంచిది కాదు
  • బీజేపీపై మండిపడ్డ అశోక్ గజపతిరాజు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టు ఘటన కేసులో తనను ఎందుకు తప్పించారంటూ కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. ఈ వారెంట్ వ్యవహారం మొత్తం బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. ఎప్పుడో జరిగిన పాత కేసులను తిరగదోడటం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు మంచిది కాదని చెప్పారు. చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ashok gajapathi raju
babli project
Chandrababu
modi
amit shah
  • Loading...

More Telugu News