Chandrababu: అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చేంత వరకు ఈ దీక్ష ఆగదు: చంద్రబాబు

  • శ్రీశైలం వద్ద జలసిరికి హారతి ఇచ్చిన చంద్రబాబు
  • రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడమే లక్ష్యమన్న సీఎం
  • నీరు పుష్కలంగా ఉంటేనే ప్రాజెక్టులు వస్తాయి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించడమే తమ లక్ష్యమని... అంత వరకు తాను చేపట్టిన జలదీక్ష ఆగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలసిరికి హారతి ఇచ్చిన తర్వాత... ఆక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని... ఇప్పుడు వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉంటేనే ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు.

 గోదావరి నీటిని కృష్ణానదికి తీసుకురావాలని గతంలో సంకల్పం చేశామని... చెప్పిన విధంగానే చేసి, చూపామని చంద్రబాబు అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని, భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

Chandrababu
jala deeksha
srisailam
  • Loading...

More Telugu News