murali mohan: హీరో శివాజీ చెప్పినట్టే జరుగుతోంది: మురళీమోహన్

  • చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ శివాజీ చెప్పినట్టుగానే జరుగుతోంది
  • బాబును అప్రతిష్టపాలు చేయడం బీజేపీ వల్ల కాదు
  • చంద్రబాబును అరెస్ట్ చేస్తే.. మమ్మల్ని అరెస్ట్ చేయమంటాం

హీరో శివాజీ చెప్పినట్టుగానే ఆపరేషన్ గరుడ జరుగుతోందని టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని... ఆయనను అప్రతిష్టపాలు చేయడం బీజేపీ వల్ల సాధ్యం కాదని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే... తమను కూడా జైల్లో పెట్టమంటామని అన్నారు. చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.

ఇటీవలే శివాజీ మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ సంచలన విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ కొత్త రూపు దాల్చుకుందని తెలిపారు. ఢిల్లీ నుంచి ఈ మేరకు తనకు పక్కా సమాచారం అందిందని... రెండు మూడు రోజులు ఆలస్యమైనా చంద్రబాబుకు నోటీసులు రావడం ఖాయమని చెప్పారు. 

murali mohan
Chandrababu
babli project
arrest
bjp
modi
  • Loading...

More Telugu News