Vijayawada: 'వినాయక చవితి' ముసుగున అశ్లీల నృత్యాలు... విజయవాడలో పలువురి అరెస్ట్!

  • ఉత్సవాల వేళ రికార్డింగ్ డ్యాన్స్
  • విజయవాడ, నున్న ప్రాంతంలో ఘటన
  • ఎనిమిది మంది అరెస్ట్

దేవుడి పేరు చెప్పి, అశ్లీల నృత్యాలకు తెగబడిన పలువురిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక చవితి పర్వదినం నాడు, విజయవాడ శివార్లలోని నున్న ప్రాంతంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా, ఓ మండప నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేసి, నలుగురు యువతులను తెచ్చి, వారితో అసభ్య నృత్యాలను చేయించారు.

నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు, మెరుపుదాడి చేసి, నలుగురు అమ్మాయిలను, మరో నలుగురు మండప నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, యువకులపై ఐపీసీ సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించామని అన్నారు.

Vijayawada
Recording Dance
Nunna
Arrest
Police
  • Loading...

More Telugu News