Chandrababu: ఇది చంద్రబాబు దుర్మార్గం... బాబ్లీ కేసులో ఏ2 గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు!

  • వారెంట్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు
  • కేసీఆర్, కేటీఆర్ లపై ఎన్నో కేసులున్నాయి
  • టీడీపీ పన్నాగాలను ప్రజలు తిరస్కరించడం ఖాయమన్న కమలాకర్

ధర్మాబాద్ న్యాయస్థానం తనతో సహా చంద్రబాబు తదితర 15 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడంపై టీడీపీ మాజీ నేత, తెలంగాణలో తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో తాను ఏ2గా ఉన్నానని గుర్తు చేసిన ఆయన, కోర్టు నోటీసులను రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు.

తనపై 18 కేసులు ఉన్నాయని, తాను ఎన్నడూ పబ్లిసిటీ కోసం వాటిని వాడుకోలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సహా, కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలపై ఎన్నో కేసులను పెట్టారని, చంద్రబాబులా వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నడూ వాడుకోలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, చంద్రబాబు ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారని, వీటిని గమనిస్తున్న ప్రజలు, టీడీపీని తిరస్కరించడం ఖాయమని అన్నారు.

Chandrababu
Gangula Kamalakar
KCR
KTR
Court Notice
Arrest Warrent
  • Loading...

More Telugu News