chaitu: తెలుగు రాష్ట్రాల్లో 'శైలజా రెడ్డి అల్లుడు' తొలిరోజు వసూళ్లు

  • 'శైలజా రెడ్డి అల్లుడు'కి భారీ ఓపెనింగ్స్ 
  • నైజామ్ షేర్ 2.50 కోట్లు 
  • సీడెడ్ షేర్ 1.04 కోట్లు  

అల్లుడిపై పెత్తనం చేయాలనుకునే అత్త .. పొగరుబోతు భార్య .. ఈ ఇద్దరినీ దారిలో పెట్టే కథానాయకుడు నేపథ్యంగా గతంలో చాలా కథలే తెలుగు తెరపై సందడి చేశాయి. అదే తరహా కథను దర్శకుడు మారుతి తనదైన స్టైల్లో ఆవిష్కరించాడు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని 'శైలజా రెడ్డి అల్లుడు'ను రూపొందించారు. నిన్ననే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే 2.50 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 1.04 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలుపుకుని 6.93 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం. మారుతి మార్క్ కథాకథనాలు .. రమ్యకృష్ణ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా చెబుతున్నారు. గతంలో ఈ తరహా సినిమాల్లో నాగ్ మెప్పించారు .. అలాంటి పాత్రనే చైతూ చేయడం పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   

chaitu
anu
ramyakrishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News