NTR: విదేశాల్లో 'ఎన్టీఆర్'కి డిమాండ్... బాలయ్య సినిమాలకు గతంలో ఎన్నడూ రానంత ఆఫర్!

  • ఓవర్ సీస్ లో రూ. 20 కోట్ల డిమాండ్
  • ప్రీలుక్, పోస్టర్ల విడుదల తరువాత భారీ హైప్
  • కొత్త రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నిర్మిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా సాగుతున్న వేళ, ఇప్పటికే విడుదలైన ప్రీలుక్, పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభం కాగా, ఓవర్ సీస్ నుంచి రూ. 20 కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. గతంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమా కూడా విదేశాల్లో ఇంత మొత్తం కలెక్షన్లను సాధించలేదు. ఆయన సినిమాలకు ఇంత భారీ ఆఫర్ రావడం కూడా ఇదే తొలిసారి.

ఇక సంక్రాంతి కానుకగా, విడుదల కానున్న ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రానా చంద్రబాబు పాత్రలోనూ, విద్యాబాలన్ బసవతారకం పాత్రలోనూ, సుమంత్ ఏఎన్నార్ పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

NTR
Biopic
Balakrishna
Krish
Oversease
  • Loading...

More Telugu News