USA: అమెరికాలో గ్యాస్‌ పైపులైన్‌ లీకేజీతో 70 ఇళ్లలో పేలుళ్లు.. ఆరుగురికి గాయాలు

  • అమెరికాలోని ఆండోవర్‌ పట్టణంలో ఘటన
  • పది ఇళ్ల నుంచి అలారమ్‌లు
  • ఘటనా స్థలికి చేరుకున్న 50 ఫైర్‌ ఇంజన్లు

గృహావసరాలకు గ్యాస్‌ సరఫరా చేసే పైపులైన్‌లో సమస్య కారణంగా వరుసగా 70 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. పైపులైన్‌లో లీకేజీలే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. అమెరికాలోని మెసాచూసెట్స్‌ మెర్రిమాక్‌ వ్యాలీలోని ఆండోవర్‌ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఒకేసారి పదిళ్లలోని అలారమ్‌లు మోగాయి. వెంటనే 50 ఫైర్‌ ఇంజన్లు, 10 అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకున్నాయి’ అని అధికారులు తెలిపారు.

‘మొత్తం 70 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. పట్టణం ఒక యుద్ధ భూమిని తలపించింది. నా కెరీర్‌లో ఇటువంటి ఘటన ఎప్పుడూ చూడలేదు’ అని అగ్నిమాపక శాఖాధికారి మైఖేల్‌ వ్యాఖ్యానించారు. ఘటనా స్థలి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 38 చోట్ల మంటలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.

USA
  • Loading...

More Telugu News