Kerala: ప్రజలు చచ్చిపోతున్నప్పుడు ఆలయాల్లోని సంపద ఎందుకు? కేరళ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయండి: బీజేపీ ఎంపీ

  • ఆలయాల్లోని సంపద వల్ల ఉపయోగం ఏంటి?
  • వరదల నష్టం రూ. 21 వేల కోట్లే..
  • ఆలయాల్లో లక్ష కోట్లకు పైగా సంపద ఉంది

వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మూడు ఆలయాల్లోని బంగారం సంపదను ఉపయోగించాలని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సూచించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి ఆలయం, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, గురువాయూర్‌ ఆలయాల సంపద, బంగారాన్ని ఉపయోగించడం ద్వారా కేరళకు మళ్లీ పునర్వైభవం తీసుకురావచ్చని ఎంపీ సలహా ఇచ్చారు.

ఈ మూడు ఆలయాల్లోనూ కలిపి లక్ష కోట్లకు పైగా సంపద ఉందని ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా సంభవించిన నష్టం  రూ.21 వేల కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఇటువంటి సంపద వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రజలు కూడా తన సలహాకు మద్దతు ప్రకటించాలని కోరారు.

Kerala
BJP
Udit Raj
Padmanabha Temple
Sabarimala
Guruvayur
  • Loading...

More Telugu News