Tirupati: చంద్రబాబు తిరుపతి పర్యటనలో అపశ్రుతి... విధులు నిర్వహిస్తున్న ఎస్సై మృతి!

  • ఏర్పేడు ఎస్ఐగా పని చేస్తున్న వెంకటరమణ
  • చంద్రబాబు పర్యటనలో బందోబస్తు విధులు
  • గుండెపోటుకు గురై మరణించిన వెంకటరమణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న వేళ విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా సీఎం బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ వెంకటరమణ, తీవ్ర గుండెపోటుకు గురై మృతిచెందాడు.

ఏర్పేడు ఎస్ఐగా పని చేస్తున్న వెంకటరమణను తిరుపతి బందోబస్తు విధుల్లో భాగం చేశారు. ఈ ఉదయం చంద్రబాబు కాన్వాయ్ రేణిగుంట వెళ్లేందుకు బందోబస్తులో నిమగ్నమైన వేళ వెంకటరమణకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదు. వెంకటరమణ మృతితో ఆయనింట తీవ్ర విషాదఛాయలు అలముకోగా, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tirupati
Chandrababu
SI
Heart Attack
Venkataramana
  • Loading...

More Telugu News