Bandla Ganesh: బండ్ల గణేష్ ను ఆహ్వానించి, కాంగ్రెస్ లో చేర్చుకున్న రాహుల్ గాంధీ!

  • ఈ ఉదయం న్యూఢిల్లీకి వచ్చిన బండ్ల గణేష్
  • కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న రాహుల్ గాంధీ
  • షాద్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ పడే అవకాశం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన గణేష్, అధికారికంగా కాంగ్రెస్ లో చేరిపోయారు. బండ్ల గణేష్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు పరిచయం చేయగా, గణేష్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.

 హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ నియోజకవర్గం నుంచి గణేష్, అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడతారని తెలుస్తోంది. బండ్ల గణేష్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ మొదలైంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు సహా పలు కీలకాంశాలపై రాహుల్ సలహాలను వీరు పొందనున్నారు.

Bandla Ganesh
Tollywood
Rahul Gandhi
Shadnagar
Telangana
Congress
  • Loading...

More Telugu News