New Delhi: తల్లీకుమార్తెలపై ఐదేళ్లుగా అత్యాచారం.. దొంగబాబాను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ఢిల్లీలో హజ్ ఖాన్ ఆశ్రమంలో దారుణం
  • బాబా కుమారుడు, స్నేహితుల లైంగికదాడి
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్

సన్మార్గం చూపాల్సిన స్వామిజీ దారి తప్పాడు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగని సదరు ప్రబుద్ధుడు ఆమె కుమార్తెపై కూడా లైంగికదాడికి దిగాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు సదరు ప్రబుద్ధుడిని కటకటాల వెనక్కు నెట్టారు.

దేశరాజధానిలోని హజ్ ఖాన్ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆషు మహరాజ్ పై ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 నుంచి 2013 వరకూ ఆషు మహరాజ్, ఆయన స్నేహితులు, కుమారుడు సమర్ ఖాన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. నిందితులు తన మైనర్ కుమార్తెపై కూడా అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 10న బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు ఆషు మహరాజ్ తో పాటు ఆయన కుమారుడు సమర్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో తాము జరిపిన దర్యాప్తులో బలమైన సాక్ష్యాలు లభించాయని ఏసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. ఆషు మహరాజ్ తో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేశామనీ, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

New Delhi
gang rape
fake baba
  • Loading...

More Telugu News