Amazon: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దాతృత్వం.. ఇళ్లు లేని కుటుంబాల కోసం 2 బిలియన్ డాలర్ల నిధి!

  • పెద్ద మనసు చాటుకున్న అపర కుబేరుడు
  • ఇళ్లు, ప్రీ స్కూళ్ల నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లతో నిధి
  • తర్వాతి తరం పిల్లలకు దుర్భర జీవితాలు వద్దనే

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇల్లు లేని వారి కోసం, ప్రీ స్కూల్స్ నిర్మాణం కోసం ‘డే వన్ ఫండ్’ పేరుతో ఏకంగా 2 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధులతో ప్రపంచవ్యాప్తంగా పేదలకు ఇళ్లతో పాటు, ప్రీ స్కూళ్ల కోసం భవనాలు నిర్మించనున్నారు. తన భార్య  మేక్‌కెన్జీతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెజోస్ పేర్కొన్నారు. ఇతరులకు సేవ చేయగలమన్న నమ్మకంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌ను 5 జూలై 1994లో బెజోస్ స్థాపించారు. ఆన్‌లైన్ వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ నికర విలువ ప్రస్తుతం 163 బిలియన్ డాలర్లు. సేవ చేయాలన్న నిర్ణయాన్ని గతేడాదే తీసుకున్నానని, ఇందుకోసం పలువురి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్టు బెజోస్ ఈ సందర్భంగా తెలిపారు. మన తాత ముత్తాలతో పోలిస్తే మన జీవితాలు మెరుగ్గా ఉన్నాయన్న ఆయన ఇప్పుడు మనమేదైనా చేయకపోతే మన తర్వాతి తరం పిల్లలు కూడా మళ్లీ అదే జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నారు. మంచిని ప్రపంచమంతా పంచిపెట్టాలని బెజోస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News