Chattisghat: కళ్లెదుటే ప్రేయసి గ్యాంగ్ రేప్... చూసి తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య!

  • చత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో కలకలం
  • ప్రియుడిని కొట్టి, మైనర్ బాలికపై అత్యాచారం
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే, ఆపలేకపోయానన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కటోహోరా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమలో ఉన్నారు.

ఈ క్రమంలో వారిద్దరూ ఓ పాఠశాల వద్ద కూర్చుని ఉండగా, ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు వచ్చి సాయితో గొడవకు దిగారు. ఆపై సవాన్ కు కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. ఆపై తాము రేప్ చేశామని వారిద్దరూ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Chattisghat
Gang Rape
Korba
Lover
Arrest
Police
  • Loading...

More Telugu News