Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం.. నేడు కాంగ్రెస్‌లో చేరిక

  • కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
  • వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి ఎన్నికల బరిలోకి
  • ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్, నేతలు

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై షాద్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు (శుక్రవారం) జరగనున్న కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గణేశ్ చేరికతో షాద్ నగర్‌లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.   

Bandla Ganesh
Tollywood
Congress
Shadnagar
Telangana
  • Loading...

More Telugu News