Andhra Pradesh: మా సహనాన్ని పరీక్షించొద్దు.. కక్ష సాధింపులకు గుణపాఠం తప్పదు: బీజేపీకి బుద్దా వెంకన్న హెచ్చరిక

  • 'ఆపరేషన్ గరుడ'లో భాగంగానే నోటీసులు
  • బీజేపీకి గుణపాఠం తప్పదు
  • ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపు

ఎనిమిదేళ్ల నాటి కేసును తవ్వి తీసి చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. కక్షతోనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ బెదిరింపులకు చంద్రబాబు భయపడరని, బాబును ముట్టుకుంటే భస్మం అయిపోతారని హెచ్చరించారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. ఇక చూస్తూ ఊరుకోబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

చంద్రబాబుకు నోటీసులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించాలని బుద్దా వెంకన్న అన్నారు. తెలంగాణ ఎడారి కాకూడదనే నాడు చంద్రబాబు పోరాడారన్నారు. చంద్రబాబు జోలికొస్తే ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మోదీ కుట్రలు ఇలాగే కొనసాగితే వారణాసిలోనూ ఆయనకు డిపాజిట్ రాదన్నారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే ఇదంతా జరుగుతోందని బుద్దా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Buddha venkanna
Telugudesam
Telangana
KCR
  • Loading...

More Telugu News