Nallala Odelu: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గట్టయ్యను పరామర్శించిన ఓదేలు

  • ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమని వెల్లడి
  • బాల్క సుమన్ ఎలాంటి వ్యక్తో ఓయూ విద్యార్థులకు తెలుసన్న ఓదేలు
  • బాల్క సుమన్ జీవిత చరిత్రను కేసీఆర్ ముందుంచుతా: ఓదేలు

పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్‌పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌పై తన వర్గం దాడి చేయలేదని.. ఆ అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. సుమన్ జీవిత చరిత్రను కేసీఆర్ ముందు బయట పెడతానని వెల్లడించారు. అతను ఎలాంటి వ్యక్తో ఓయూ విద్యార్థులకు తెలుసన్నారు ఓదేలు. చెన్నూరు అసెంబ్లీ సీటును ఓదేలుకు కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన అనుచరుడు గట్టయ్య నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎంలో నేడు గట్టయ్యను పరామర్శించిన అనంతరం ఓదేలు మీడియాతో మాట్లాడారు.

Nallala Odelu
TRS
  • Loading...

More Telugu News