Supreme Court: చట్టసభల ప్రతినిధుల కేసుల వివరాలు ఇవ్వండి: సుప్రీం ఆదేశం
- ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల లిస్ట్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశం
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టులకు దిశానిర్దేశం
- అక్టోబర్ 10 కల్లా తెలియజేయాలని సూచన
ప్రజా ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం ఎన్నికేసులు ఉన్నాయో తక్షణం వాటి వివరాలను అక్టోబర్ 10లోగా సమర్పించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులను ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కేసులు విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అశ్వనీ ఉపాధ్యాయ్ అనే పిటిషనర్ కేసును విచారిస్తున్న ధర్మాసనం, ప్రస్తుతం ఎన్నికేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎన్ని కేసుల్ని ప్రత్యేక కోర్టుకు బదలాయించాలో తెలియజేయాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఆయా హైకోర్టులను కోరింది.