RSR Foundation: మట్టి వినాయకుడిని పూజిస్తే హెల్మెట్‌ గెలుచుకునే ఛాన్స్.. ఆర్‌ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆఫర్

  • పర్యావరణ పరిరక్షణకు వినూత్న ప్రచారం
  • పూజించిన విగ్రహం వద్ద సెల్ఫీదిగి వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలి 
  • డ్రా తీసి యాభై మందికి శిరస్త్రాణాలు అందిస్తామని ప్రకటన

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో పర్యావరణానికి జరుగుతున్న హాని నేపథ్యంలో మట్టి వినాయకుడిని పూజించాలని పలు సంస్థలు, నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌...గిఫ్ట్‌ ఏ హెల్మెట్’ క్యాంపెయిన్‌ నిర్వహించడం గుర్తుండే ఉంటుంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వినాయక చవితి సందర్భంగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మట్టి వినాయకుడిని పూజించిన వారిలో లాటరీ ద్వారా యాభై మందిని ఎంపిక చేసి, వారికి ఉచితంగా హెల్మెట్లు అందిస్తామని సంస్థ చైర్మన్‌ రంకిరెడ్డి సుబ్బరాజు ప్రకటించారు.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా...వినాకుడిని పూజించి సెల్ఫీ దిగి ఫొటో, పేరు, ఆధార్‌ నంబర్‌ను 9652128516 అనే నంబర్‌కు వాట్సాప్‌ చేయడమేనని ఆయన ప్రకటించారు. ఇలా వాట్సాప్‌ పంపిన వారందరిని ఈ నెల 22న డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తామన్నారు. 

RSR Foundation
vinayakachaviti
  • Loading...

More Telugu News