Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే రాపాక.. టికెట్ ఖరారు?

  • పవన్ ను కలిసిన రాపాక వరప్రసాదరావు
  • హైదరాబాదులో భేటీ
  • ఉత్సాహంలో జనసేన శ్రేణులు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్టు చెబుతున్నప్పటికీ... జనసేనలో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టు సమాచారం. రాపాకను కలసి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించాలని జనసేన శ్రేణులకు రెండు రోజుల క్రితం ఓ కీలక నేత సలహా ఇచ్చారట.

దీంతో, వివిధ గ్రామాల నుంచి చింతలమోరికి వెళ్లిన జనసైనికులు రాపాకను పార్టీలోకి రావాలని కోరారట. దీంతో, ఆయన రెండు రోజుల గడువు కోరడం, పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో పవన్ తో రాపాక భేటీ అయ్యారు. రాపాక రాకతో రాజోలులో జనసేన విజయం సాధించడం ఖాయమని పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

Pawan Kalyan
rapaka vara prasad
janasena
rajol
  • Loading...

More Telugu News